హీరో శర్వానంద్ కి ఘోర అవమానం..?

యంగ్ హీరో శర్వానంద్ కి ఘోర అవమానం జరిగిందా అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం శర్వా కెరియర్ ప్లాపులతో నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే విడుదలైన మహా సముద్రం డిజాస్టర్ గా నిలవడంతో ఈ హీరోకు ప్రస్తుతం ఒక గేమ్ చేంజర్ హిట్ అనేది తప్పకుండా అవసరం. దానికోసం శర్వా బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శర్వా ఆశలన్నీ తన తదుపరి చిత్రాలు ‘ఒకే ఒక జీవితం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పైనే పెట్టుకున్నాడు. అయితే మహా సముద్రం డిజాస్టర్ ఎఫెక్ట్ తన తదుపరి చిత్రం ‘ఒకే ఒక జీవితం’ పైన పడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్నిడైరెక్ట్ గా ఓటిటీ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే అమెజాన్ వారు నిర్మాతలకు భారీ ఆఫర్ నే ఇచ్చినట్లు తెలుస్తోంది.దీంతో నిర్మాతలు సైతం అటువైపే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం.

థియేటర్లలో రిలీజ్ చేస్తే సినిమా హిట్ అవుతుందో, ఫట్ అవుతుందో తెలియదు కాబట్టి .. ‘ఒకే ఒక జీవితం’ సినిమాను థియేటర్ రిలీజ్ చేయడం కంటే ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఎక్కువ గా ఉన్నట్లుగా నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్ భావిస్తున్నారట. అయితే ఇలా చేస్తే వారు శర్వానంద్ ని ఘోరంగా అవమానించినట్టే అని అంటున్నారు అభిమానులు. ఒక సినిమా ప్లాప్ కావడంతో మరి హీరోపై నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నారు. హీరో మార్కెటింగ్ ని దృషిట్లో పెట్టుకొని రిలీజ్ చేస్తే అది మరో డిజాస్టర్ అవుతుందేమో అన్న అనుమానం.. ఓటిటీకి ఇచ్చేస్తే కనీసం కొంతవరకైనా లాభం పొందవచ్చునని మేకర్స్ ఆలోచిస్తున్నారట. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే.

Related Articles

Latest Articles