త్వ‌ర‌లో అందుబాటులోకి స‌రికొత్త హెల్మెట్‌…ధ‌ర ఎంతో తెలుసా?

బైక్‌పై వెళ్లే స‌మ‌యంలో హెల్మెట్‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి.  లేదంటే ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో హెల్మెట్ ప్రాణాల‌ను రక్షిస్తుంది.  ఖ‌రీదైన హెల్మెట్ అంటే క‌నీసం 10వేల వ‌ర‌కు ఉంటుంది.  కానీ, ఈ హెల్మెట్ ధ‌ర మాత్రం ఏకంగా రూ.35 ల‌క్ష‌ల‌పైమాటే.  ఎందుకు అంత ఖ‌రీదు… ఆ హెల్మెట్ స్పెషాలిటి ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.  ఈ హెల్మెట్‌లో సెన్సార్లు ఉంటాయి.  ఇవి మీ మెద‌డును చ‌దివేస్తాయి.  

Read: వరంగల్ ఐటి పార్కు : 1,350 మందికి ఉద్యోగాలు..

అంతేకాదు, ఈ హెల్మెట్ మెద‌డులోని విద్య‌త్ ప్ర‌కంప‌న‌లను, రక్త‌ప్ర‌వాహాన్ని వాయువేగంతో కొల‌వ‌డంతో పాటుగా విశ్లేషిస్తుంది.  కెర్న‌ల్ కంపెనీ ఈ రకం హెల్మెట్‌ను త‌యారు చేసింది.  ఈ హెల్మెట్‌ను ఎవ‌రైనా ధ‌రించ‌వ‌చ్చు.  దాదాపుగా ఐదేళ్ల‌పాటు శ్ర‌మించి ఈ హెల్మెట్‌ను త‌యారుచేశారు.  అమెరికాలో త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-