ఇవాళ్టి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఇవాళ్టి నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వాహనసేవలు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామని.. గరుడ వాహన సేవను రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కోవిడ్ తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూన్నామని… ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడంతో స్వర్ణరథం, మహరథం బదులుగా సర్వభూపాల వాహన సేవను నిర్వహిస్తామని చెప్పారు. చక్రస్నాన కార్యక్రమాని ఆలయంలోని అద్దాల మహల్ లో నిర్వహిస్తామని.. రాష్ర్ట ప్రభుత్వం తరపున 11వ తేదిన సీఎం జగన్ పట్టువస్ర్తాలను సమర్పిస్తారన్నారు. 11వ తేదిన బర్డ్ హస్పిటల్ ప్రాంగణంలో పిడియాట్రిక్ కార్డిక్ హస్పిటల్ ,గో మందిరం,అలిపిరి నడకమార్గాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే… టిటిడి వాహనాల ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తరలిస్తామని ఆయన ప్రకటించారు.

-Advertisement-ఇవాళ్టి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Related Articles

Latest Articles