థర్డ్‌వేవ్‌ తప్పదు… ఆ రెండు నెలల్లోనే !

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, రానున్న రోజుల్లో కరోనా థర్డ్‌వేవ్‌ అనివార్యమని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. సెప్టెంబర్‌-అక్టోబర్‌ మధ్యకాలంలో థర్డ్‌వేవ్‌ గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నట్లు ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు అంచనా వేశారు. సామాన్య ప్రజలకు కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌పై ఆందోళన మొదలయ్యింది. సెకండ్‌ వేవ్‌ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని SIR మోడల్‌ ఆధారంగా థర్డ్‌వేవ్‌ను అంచనా వేశామని ఐఐటీ కాన్పూర్‌ వెల్లడించింది.

read also : ఆ వ్యాఖ్యలు ఆంధ్రప్రజలను ఉద్దేశించింది కాదు: మంత్రి వేముల

జులై 15వరకు దేశవ్యాప్తంగా మొత్తం అన్‌లాక్‌ ప్రక్రియ జరిగితే.. థర్డ్‌వేవ్ విజృంభిస్తుందని అంచనా వేసింది. కాగా.. దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 50,848 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,00,28,709 కి చేరింది. ఇందులో 2,89,94,855 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 6,43,1941 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1,358 మంది మృతి చెందారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-