ఇండియాలో థ‌ర్డ్ వేవ్‌… ఆ వేరియంట్ కార‌ణ‌మౌతుందా?

ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.  క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే కేంద్రం అప్ర‌మ‌త్తం చేసింది.  కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌తో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండ‌టంతో థ‌ర్డ్  వేవ్ ముప్పు పొంచి ఉంద‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి.  అక్టోబ‌ర్ నెల‌లో థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంటుంద‌ని గ‌తంలో నిపుణులు పేర్కొన్నారు.  అయితే, థ‌ర్డ్ వేవ్ ఈ నెల‌లోనే ఉండే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  మొద‌టి, రెండో వేవ్‌ల మ‌ధ్య వ‌చ్చిన గ్యాప్‌, తీవ్ర‌త, కేసుల పెరుగుద‌ల ఆధారంగా థ‌ర్డ్ వేవ్‌ను అంచ‌నా వేస్తున్నారు.  సెకండ్ వేవ్‌కు కార‌ణ‌మైన డెల్టావేరియంట్, థ‌ర్డ్ వేవ్‌కు కూడా కార‌ణం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.  ప్ర‌స్తుతం డెల్టావేరియంట్ అమెరికా, జ‌పాన్‌, మ‌లేషియా, ఇరాన్‌తో పాటుగా ప్ర‌పంచంలోని 130 దేశాల్లో వ్యాపించింది.  ఈ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉండ‌టంతో ప్ర‌పంచంలోని అన్ని దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి. 

Read: బ్లేజర్‌ బటన్స్ విప్పేసి పూజాహెగ్డే రచ్చ..!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-