ఎన్టీఆర్ రిలీజ్ చేసిన “తిమ్మరుసు” ట్రైలర్

టాలెంటెడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రంలో సత్యదేవ్ నిజాయితీగల కార్పొరేట్ న్యాయవాదిగా కనిపించబోతున్నాడు. ఆయన సరసన ప్రియాంక జవాల్కర్ రొమాన్స్ చేయనుంది. బ్రహ్మజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్ దర్శకత్వం వహించాడు. మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది.

Read Also : భారీ రేటుకు “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా లాంచ్ చేశారు. ట్రైలర్ చూసిన ఆయన ఆసక్తికరంగా ఉందని చెబుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో మొదటగా విడుదలవుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తాజాగా ఈ విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇందులోని క్రైమ్ కోణం దానికి తగ్గట్లుగా ఉన్న బ్యాక్ గగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ గ్రిప్పింగ్ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-