నల్ల బియ్యం వరి పంటపై కన్నేసిన దొంగలు

పుంగనూరు(మం)బొడినాయుడు పల్లె గ్రామంలో బ్లాక్ ప్యాడి వరి (నల్లబియ్యం) కంకులను దొంగతనం చేసిన సంఘటన కలకలం సృష్టిస్తుంది. మాములుగా అయితే దొంగలు నగలు, డబ్బు, మరేదైనా ఇతర వస్తువులను దొంగతనం చేస్తుంటారు. కానీ విచిత్రంగా నల్లబియ్యం పంటపై దొంగలు కన్నేయడం ఏంటని రైతు వాపోతున్నాడు. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. అతి ఖరీదైన అరుదైన పంట ఈ నల్ల బియ్యం, ఈ కంకులను అర్ధరాత్రి కంకులను కోసుకుని వెళ్లారు గుర్తుతెలియని దుండగులు.

కొత్త పంట పై రైతులకు ఆసక్తి కోసం ఒకటిన్నర ఎకరాల్లో ఈ పంట వేసిన రైతు వసంత్ కుమార్.. ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బియ్యం మార్కెట్ విలువ కేజీ సుమారు రూ. 320 గా ఉంది. దాదాపు రెండు క్వింటాళ్ల( వరి) బ్లాక్ ప్యాడి వరి కంకులను దొంగలు కోసుకు వెళ్లారు. ఈ దొంగతనం పై రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఏఎస్ ఐ త్యాగరాజు, కానిస్టేబుల్ బ్లాక్ పైడి పంటను పరిశీలించి రైతు దగ్గర నుంచి వివరాలను సేకరించారు. దొంగలను త్వరగా పట్టుకోవాలని రైతు వసంత కుమార్‌ పోలీసులను కోరారు.

Related Articles

Latest Articles