మూడు రాజధానులపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇవే

మూడు రాజధానులపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ అసెంబ్లీ ప్రకటన చేశారు. కొన్ని మార్పులతో మళ్లీ తీసుకువస్తామని చెప్పారు సీఎం జగన్‌. అసలు అసెంబ్లీ లో సీఎం జగన్‌ ఏం మాట్లాడారంటే… 1953 నుంచి 1956 వరకు ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆరోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేదన్నారు. ఆ తర్వాత 1956లో కర్నూలు నుంచి రాజధానిని కానీ, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు ఏ రకంగా తీసుకుని పోయారు, తీసుకుని పోయేటప్పుడు ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడ ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని శ్రీబాగ్‌ ఒడంబిక, అవన్నీ చేసి రకరకాలుగా ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబునాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం, అప్పట్లో ఆ నిర్ణయం కాంట్రవర్సెల్‌ అని తెలుసు. అప్పట్లో అన్ని రకాలుగా శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని తెలుసు. అయినప్పటికీ కూడా తాను ఇక్కడ 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్‌ అన్నారు.

”ఈరోజుకు కూడా నేను చెపుతున్నాను. అలా నిర్ణయం తీసుకోవడం వల్ల… ఈ ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదు. నా ఇళ్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ కూడా. కానీ ఒక్కటి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతం అటు విజయవాడ కాదు ఇటు గుంటూరు కాదు. ఇక్కడ నుంచి గుంటూరు తీసుకుంటే 40 కిలోమీటర్లు, విజయవాడ తీసుకుంటే మరో 40 కిలోమీటర్లు . ఇక్కడ కనీస మౌలికసదుపాయాలు చూస్తే… రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మాత్రమే అయ్యే ఖర్చు… గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు. 50వేల ఎకరాలు అంటే లక్ష కోట్లు రూపాయలు అని లెక్కవేశారు. లక్ష కోట్లు అనేది ఈ రోజు లెక్కలు ప్రకారం. ఒక పదేళ్లు పోతే ఇది కట్టడానికి ఆ లక్ష కోట్లు తేవడానికి, తెచ్చి పెట్టడానికి పదేళ్లు పడుతుందో ఇంకా ఎక్కువ కాలం పడుతుందో తెలియదు కానీ.. ఒక పదేళ్లు పోతే ఇవాళ ఖర్చయ్యే లక్ష కోట్ల విలువ అది ఏ ఆరు లక్షల కోట్లో, ఏడు లక్షల కోట్లో అవుతుంది. అంటే మన దగ్గరున్న డబ్బుతో కనీసం మనం రోడ్లేసుకోవడానికి, డ్రైనేజీ వేసుకోవడానికి, కరెంటు ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో మనం ఉంటే… ఇక్కడ రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా?” అంటూ జగన్‌ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles