కరోనా విజృంభన వేళ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి..

కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్‌ భారత్‌లో కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా నివేదిక ప్రకారం కరోనా వైరస్‌ పిల్లలపై కూడా దాని ప్రభావం చూపుతోంది. చిన్నారుల్లో కడుపునొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు లాంటివి ఉంటే ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే ఈ లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 5గురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు, ఇద్దరికి ఆక్సిజన్‌ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పిల్లలకు కోవిడ్‌ జాగ్రత్తలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని వైద్యులు తెలిపారు.

Related Articles

Latest Articles