అనన్య విషయంలో ఆధారాలు లేవు: ఎన్సీబీ వర్గాలు

అక్టోబర్ 21వ తేది, గురువారం దాదాపు నాలుగు గంటల పాటు ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను ఆర్యన్ ఖాన్ తో ఉన్న అనుబంధం, డ్రగ్స్ వాడకంపై తమ కార్యాలయంలో విచారించారు. దానికి ముందు ఆమె సెల్ ఫోన్ ను, లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అలానే ఆర్యన్ తో అనన్య గతంలో చాటింగ్ చేసిన విషయాలను ఎన్సీబీ అధికారులు ఈ సందర్భంగా ఆమె దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. విశేషం ఏమంటే… ఆర్యన్, అనన్య మధ్య రెగ్యులర్ గా డ్రగ్స్ గురించిన చాటింగ్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. అందులో ఒక సందర్భంలో ఆర్యన్ ఆమెను డ్రగ్స్ అరేంజ్ చేయమని కోరినట్టు ఉందట. దానికి ఆమె కూడా తప్పకుండా అందిస్తానని రిప్లయ్ ఇచ్చిందట. అయితే డ్రగ్స్ ను ఆమె ఆర్యన్ కు అందచేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు.

Read Also : ‘నాట్యం’ బృందానికి ఉప రాష్ట్రపతి ప్రశంసలు!

తమ మధ్య డ్రగ్స్ విషయమై సరదాగా చాటింగ్ జరిగేదని, అది సీరియస్ గా కాదని, జోక్ చేసుకుంటూ తాము అలా చాటింగ్ చేసుకునే వాళ్లమని అనన్య తెలిపినట్టు ఎన్సీబీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం నాలుగు గంటల పాటు అనన్యను విచారించిన అధికారులు మరోసారి ఆమెను విచారణకు పిలిచే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్సీబీ అధికారులు ‘ఒక వ్యక్తి ఇంటిని తాము సోదాచేసినా, వారిని విచారణకు పిలిచినా, వారు నేరస్తులు అనుకోవాల్సిన అవసరం లేదని, కొన్ని కేసులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి కూడా అలాంటివి చేస్తుంటామ’ని వివరణ ఇచ్చారు. మొత్తం మీద షారుక్ కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానాతో ఉన్న స్నేహబంధానికి అనన్యా పాండే భారీ మూల్యమే చెల్లించేలా ఉంది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

Latest Articles