వరి వేస్తే ఉరి.. మరీ సగటు రైతన్న దారేటు..?

రాష్ర్టంలో గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు, యాసంగి వరి పంటపైన తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు వరిపంట కొనుగోలుపై ఎప్పుడు రానీ కష్టం.. ఇప్పుడేందుకు వచ్చింది. ఈ విషయం పై ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే, అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం నెపాన్ని కేంద్రం మీద తోస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దీనిపై రాజకీయాలు ఎలా ఉన్న చివరికి నష్ట పోయేది మాత్రం సగటు రైతన్నలే.. కేంద్రం దీనిపై ఏం చెబుతుంది రా రైస్‌ మాత్రమే తీసుకుంటామని, కానీ తెలంగాణలో రా రైస్‌ కన్నా ఉప్పుడు బియ్యం ఎక్కువగా పండుతుంది. దీనిపై రైతన్నలు ఆగ మాగం అవుతున్నారు. వానకాలం పంటలో ప్రస్తుతం కల్లాలో ఉన్నవి రా రైస్‌ అయినా కూడా కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ర్టాధినేతలకు ఎంత ధాన్యం కల్లాలో ఉందో స్పష్టత లేదు.

ప్రభుత్వ ప్రకటనలతో.. రైతన్నలు ఆగం…
గతంలో రాష్ర్ట సీఎం చేసిన ప్రకటనలు ఇప్పుడు రైతన్నలను ఆగం చేశాయి. ఒకసారి ఎంతైనా ధాన్యం కొంటామని చెప్పారు. మరోసారి వరివస్తే ఉరే అంటూ ప్రకటనలు చేశారు. దీంతో సాక్షాత్తూ రాష్ర్ట సీఎం ఇలాంటి ప్రకటనలు ఇవ్వడంతో తెలంగాణ రైతుల్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒక సందర్భంలో తెలంగాణలో పంటలు పండించేందుకు తగినంత నీరు లేకపోయింది. కేవలం నీరు తక్కువ గా ఉండే మెట్ట పంటలు మాత్రమే వేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం తెలంగాణ సర్కార్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఎస్సారెస్పీ కాలువల ను చెరువులకు అనుసంధానం చేయడంతో పుష్కలంగా నీరు ఉంది. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు మెట్ట పంటలు వేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి దీనికి అనుగుణంగా వరి మాత్రమే వేయగలరు. పైగా తెలంగాణ నేలలో వరి మాత్రమే ఎక్కువగా పండుతుంది.

ఈ విషయలేవీ రాష్ట్ర సర్కార్‌కు తెలియదా అంటే సమాధానం చెప్ప డం కష్టమే.. ఇప్పుడు వరి వేయేద్దని రైతన్నలను ఆగం పట్టిస్తు న్నారు. మాట మాట్లాడితే కేంద్రం ధాన్యం కొనడం లేదు అనే సమా ధానం తప్ప ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం లేదు రాష్ర్ట ప్రభుత్వం. మిల్లర్ల తో సమావేశం నిర్వహించి రైతులు పండించే ధాన్యం కొనుగోలు పై చర్చించి మార్కెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్న ఆదిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు వ్యవసాయ శాఖ కూడా దీనిపై స్పందించడం లేదు. పంటలు వేసే ముందే రైతులను అప్ర మత్తం చేయాల్సి ఉన్నా ఆ దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదు.

రైతన్నలతో రాజకీయ క్రీడ..
రైతన్నలు ఇప్పటికే యాసంగి వరి పంట వేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉంటే ఆయా పార్టీల నేతలు మాత్రం రైతన్నలను అడ్డం పెట్టుకుని తమదైన రాజకీయ క్రీడను మొదలు పెట్టారు. ముందుగా అధికార పార్టీ తనవైపు ఏం తప్పు లేదని ఆ నెపాన్ని కేంద్రం పై నెట్టి వేసింది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ అధికార పార్టీలు తప్పం తా తెలంగాణ సర్కార్‌దేనంటూ విమర్శల బాణాలు వదులుతున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఒక్క అడుగు ముందుకేసీ మరీ కేంద్రం తప్పేమి లేదని వాదిస్తున్నారు. ఇప్పటికే కల్లాలో ధాన్యం అలాగే ఉం ది రాష్ర్ట వ్యాప్తంగా 8వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం 4,700కుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో పలువురు రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షడు పర్యటన చేస్తుం డగా దాడి జరిగింది. ఈదాడి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే చేశారని ఆరోపిం చారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఈ దాడి తమ కార్యకర్తలు చేయలేదని ఖండిస్తోంది. ఏది ఏమైనా అన్ని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి అన్నదాతలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే రైతులు అకాల వర్షాలు, చీడపీడలు, ప్రకృతి విపత్తులతో సతమత మవుతూ ఉన్నారు. ఈ సమయంలో వారిని ఆదుకోవాల్సి ఉంది.

ఇదే సమయంలో అన్నదాతలు సైతం తెలివిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ, నాయకుల ప్రకటనలకు మోసపోకుండా తమ నేలల్లో ఏ పైరు వేస్తే మంచిదో వ్యవసాయశాఖ అధికారులు సూచనలు పాటించి పంటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూసార పరీక్షలు చేసి తమ నేలలో ఏ పంటకు అనువుగా ఉంటుందో రైతన్నలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ మోజార్టీ రైతులు చదువు లేకపోవడం వలన ఈ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. వ్యవసాయ శాఖ కూడా దీనిపై రైతులను అప్రమత్తం చేయాల్సి ఉన్నా ఆదిశగా ప్రయత్నాలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పవచ్చు.

Related Articles

Latest Articles