బీరు బాటిల్స్ తీసుకెళ్తున్న లారీ దొంగతనం…

మెదక్ కొల్చారంలో ఐఎంఎల్ ( మద్యం స్టోరేజ్ సెంటర్) కి బీరు బాటిల్స్ తీసుకొస్తున్న లారీని దొంగలించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో బీర్ ఫ్యాక్టరీ లో కార్టన్లను లారీ లో లోడ్ చేసారు. అక్కడి నుండి కొల్చారం మండలం చిన్న ఘనపూర్ డిపోలో లోడ్ ను దింపేందుకు లారీ వచ్చింది. కానీ అక్కడ వరుసగా లారీల క్యూ ఉండడంతో డ్రైవర్ ఇంటికి వెళ్ళాడు. సమయం చూసుకొని లారీతో సహా బీర్లను తీసుకుని వెళ్లి పోయారు దొంగలు. లారీ లో 22 లక్షలు విలువ అయిన 1300 బీర్ల కార్టన్లు ఉన్నట్లు సమాచారం. దాంతో లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని సీసీటీవీ ఆధారంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.

Related Articles

Latest Articles

-Advertisement-