యూరప్‌లోనే కోవిడ్‌ మరణాల సంఖ్య ఎక్కువ: WHO

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కోవిడ్‌ మరణాలు ఒక్క యూరప్‌లోనే పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలోనమోదైన కోవిడ్‌ మరణాల్లో 5శాతం మేర యూరప్‌ ఖండంలోనే పెరుగుదల కనిపించినట్టు వెల్లడించింది. అమెరికా, యూరప్‌, ఆసియా ప్రాంతాల్లో పెరుగుదలతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 6శాతం మేర పెరిగాయని పేర్కొం ది. యూరప్‌ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కోవిడ్‌ మరణాలు స్థిరంగా ఉండటమో, తగ్గడమో జరిగిందని, గతవారంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 50వేల మరణాలు సంభవించినట్టు వారాంతపు రిపోర్టులో పేర్కొంది. అలాగే..3.3 లక్షల కొత్త కేసులు నమోదు కాగా వాటిలో 2.1 మిలియన్‌ కేసులు యూరప్‌లోనే వచ్చనట్టు పేర్కొంది. జూలై నుంచి ఆఫ్రికా, మద్యప్రాచ్యం ఆగ్నేయాసియాలో ఇన్ఫెక్షన్లు తగ్గుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

పశ్చిమ యూరప్‌లో 60శాతం మంది ప్రజలు పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకోగా.. తూర్పు ప్రాంతంలో మాత్రం కేవలం సగం మంది మాత్రమే టీకా పొందారాని తెలిపింది. వ్యాక్సిన్‌పై అపోహాలు తొల గించడం, పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ను వేయించుకునేలా అధికారు లు శ్రమిస్తున్నారు. కరోనా మహమ్మారికి యూరప్‌ కేంద్రంగా మారిం దని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది జనవరి నాటికి మరో ఐదు లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో అధికారులు హెచ్చరించారు. కోవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని యూకే నిర్ణయించగా.. ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌ సహా పలు దేశాలు మాత్రం లాక్‌డౌన్‌ తరహాలో కొన్ని చర్యలను మరోసారి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

Related Articles

Latest Articles