కర్నూలులో కాల్‌ మనీ కర్కశత్వం..

ఓ మహిళపై కాల్‌ మనీ టీం దాడి చేసిన ఘటన కర్నూల్‌ జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన సింధు మహిళ కాల్‌ మనీ టీం వద్ద రూ.4.6 లక్షలు అప్పుగా తీసుకుంది. ఈ అప్పుకు రూ.10 వేలు నెలకు వడ్డీగా కడుతోంది. ఇలా 7 నెలల్లో రూ.6.55 లక్షలు వడ్డీగా చెల్లించింది.

అయితే ఈ నెల డబ్బు చెల్లించడంలో ఆలస్యం కావడంతో కాల్‌ మనీ టీం సదరు మహిళపై కర్కశత్వంగా దాడి చేసి ఇంటినుంచి వెల్లగొట్టి ఇంటికి తాళం వేశారు. దాడి చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కర్నూలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Related Articles

Latest Articles