స్కానింగ్‌ కోసం వస్తే.. ఇంజక్షన్‌ ఇచ్చి ప్రాణాలు తీశారు

శంషాబాద్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్‌ కోసం వచ్చిన మహిళకు ఇంజక్షన్‌ ఇవ్వడంతో వికటించి మృతి చెందింది. వివరాల్లో వెళితే.. శంషాబాద్‌ పరిధిలోని తేజస్విని స్కానింగ్‌ సెంటర్‌కు రంగారెడ్డి జిల్లా కొందుర్గు చౌదరిగుడా గ్రామానికి చెందిన కవిత అనే మహిళ స్కానింగ్‌ కోసం వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో తేజస్విని స్కానింగ్‌ సెంటర్ సిబ్బంది కవితకు ఇంజక్షన్‌ ఇచ్చారు.

ఇంజక్షన్‌ ఇచ్చిన అనంతరం కవిత మృత్యవాత పడింది. దీంతో కవిత మృతికి తేజస్విని స్కానింగ్‌ సెంటర్‌ వారే కారణమని సదరు స్కానింగ్‌ సెంటర్‌ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న పోలసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు వెల్లడించారు.

Related Articles

Latest Articles