‘వలిమై’ సైతం వాయిదా పడింది!

అనుకున్నంతా అయ్యింది! తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ‘వలిమై’ నిర్మాత బోనీ కపూర్ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 13న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటి నుండే అందరిలోనూ ఇది వాయిదా పడే ఛాన్స్ ఉందనే అనుమానం కలిగింది.

ఓ పక్క కరోనా కేసులు పెరగడంతో పాటు తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ పెట్టడం, ఆదివారం లాక్ డౌన్ ప్రకటించడంతో సహజంగానే స్టార్ హీరో అజిత్ నటించిన ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు. చివరకు అదే జరిగింది. అయితే ఈ సినిమాతో పాటే విడుదల కావాల్సిన విశాల్ ‘సామాన్యుడు’ను జనవరి 26న రిలీజ్ చేస్తానని వారు ప్రకటించారు. కానీ ‘వలిమై’ ను తిరిగి ఎప్పుడు విడుదల చేసేది బోనీ కపూర్ చెప్పలేదు. ప్రేక్షకుల క్షేమమే తమకు ప్రధానమని, పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని విడుదల చేస్తామని మాత్రమే తెలిపాడు. మొత్తం మీద పక్కన తమిళనాడులో పొంగల్ బరిలో పెద్ద సినిమాలు లేక వెలవెల బోతుంటే… మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీజన్ లో దాదాపు పది పన్నెండు సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి.

Related Articles

Latest Articles