ఏపీ ఉద్యోగుల HRA పెంపుపై తెగని పంచాయతీ

ఏపీ ఉద్యోగుల HRA పెంపు వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా జేఏసీల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మరోసారి సీఎంఓ అధికారులతో సమావేశం అయిన ఉద్యోగ సంఘాల నేతలు. సీఎస్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతృప్తి చెందడం లేదు. సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే అమరావతి పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల హెచ్ఆర్ఏ 30 శాతం నుంచి 8 శాతానికి పడిపోయే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

Read Also: ఊసరవెల్లి కేసీఆర్‌ను ప్రజలు గద్దె దింపాలి: విజయశాంతి

ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు. ఈ రోజు హెచ్చార్‌ఏ పై క్లారిటీ ఇస్తామని చెప్పిన సీఎంఓ అధికారులు. ఇప్పటికీ స్పష్టతను ఇవ్వలేదు. హెచ్చార్‌ఏ పై స్పష్టత రాకుంటే తదుపరి కార్యచరణపై సమావేశం అయి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం తమకు సమ్మతం కాదని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, అయినా ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదని త్వరలోనే తమ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Related Articles

Latest Articles