బ్రేకింగ్ : ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్ధులు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బరిలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే… అసెంబ్లీకి వచ్చిన… ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైన‌ట్లు రిట‌ర్నింగ్ అధికారి నుంచి స‌ర్టిఫికెట్ తీసుకున్నారు.

క‌డియం శ్రీహరి, గుత్తా, బండ ప్రకాష్‌, ర‌వీంద‌ర్‌, వెంక‌ట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి స‌ర్టిఫికెట్ తీసుకున్న వారిలో ఉన్నారు. ఇక ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ…. ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమయ్యాయని.. మాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కి దన్యవాధాలు అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తెలంగాణ అని… అభివృద్ధి చెందుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో లో చిత్తశుద్ది పని చేస్తామని ప్రకటన చేశారు.

Related Articles

Latest Articles