ఒంటరి పురుషుల్లో ఆ ముప్పు ఎక్కువే!

ఒంటరితనానికి, ఏకాంతానికి ఎంతో వ్యత్యాసముంది. ఏకాంతంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒంటరితనంలో ఆందోళన ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా మనిషిని కుంగదీస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. తాజాగా ఓ పరిశోధనలోనూ ఇదే తేలింది. ఒంటరిగా ఉండే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని తేల్చింది. ముఖ్యంగా మధ్య వయస్సులో ఉండే వారిలో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 1980లలో ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు. 2570 మంది పురుషులు ఇందులో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వీరి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి ఈ అభిప్రాయానికి వచ్చారు పరిశోధకులు. అధ్యయనంలో పాల్గొన్న 649 (25 శాతం) మందికి క్యాన్సర్ సోకగా… 283 (11 శాతం) మంది మరణించారు. ఈ పరిశోధన ప్రకారం ఒంటరితనం క్యాన్సర్ ముప్పును 10 శాతం మేర పెంచింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-