63 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఆ ఉంగ‌రం…మ‌ళ్లీ ఇలా…

ఏప్పుడో ఆరు ద‌శాబ్ధాల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి త‌న‌ను వెతుక్కుంటూ వ‌స్తే ఎలా ఉంటుంది.  అద్భ‌తంగా ఉంటుంది క‌దా.  అమెరికాలోని బ్రోక్‌ఫోర్డ్ కు చెందున మేరీజో కు లాక్కువ‌న్నా న‌గ‌రంలో పూర్వికుల‌కు చెందిన ఓ ఇల్లు ఉన్న‌ది.  ఆ ఇల్లు స‌ర్ధుతుండ‌గా,  ఓ ఉంగ‌రం దొరికింది.  పాత కాలానికి చెందిన ఉంగ‌రం కావ‌డంతో ఆ యువ‌తి అది ఏవ‌రిదో తెలుసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  ఉంగ‌రాన్ని బ‌ట్టి అది త‌న తండ్రిది కాద‌ని తెలుసుకున్న త‌రువాత‌, త‌న తండ్రి చదువుకున్న పాఠ‌శాల‌కు వెళ్లి ఆరా తీసింది.  ఉంగ‌రంపైన ఈఎల్‌డీ అక్ష‌రాలు ఉండ‌టంతో అది 1955 బ్యాచ్‌కు చెందిన వ్య‌క్తి సంబందించిన ఉంగ‌రంగా తెలుసుకుంది.  1955 సంవ‌త్స‌రానికి చెందిన రిజిస్ట‌ర్‌ను వెతికి ప‌ట్టుకొని ఆ వ్య‌క్తి వివ‌రాలు సేక‌రించింది.  ఉంగ‌రాన్ని పోగొట్టుకున్న వ్య‌క్తి ఇంటికి వెళ్లి దానిని అత‌నికి అప్ప‌గించింది. 1958లో ఆ ఉంగ‌రాన్ని పోగొట్టుకున్న‌ట్టు 80 ఏళ్ల యూజిన్ పేర్కొన్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-