రాజస్థాన్ క్యాబినెట్ పునర్‌ వ్యవస్థీకరణ

అనేక నాటకీయ పరిణామాల మధ్యన రాజస్థాన్‌ మంత్రి వర్గం ఆదివారం కొలువుదీరింది. రాజీనామాలు అనంతరం ఆమోదం ఆదివారం మంత్రి వర్గ విస్తరణతో రాజస్థాన్‌ రాజకీయం వేడేక్కింది. శనివారం, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంలోని మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇది రాష్ట్రం లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసింది. జైపూర్‌ లోని సీఎం గెహ్లాట్ అధికారిక నివాసంలో జరిగిన రాజస్థాన్ మంత్రుల మండలి సమావేశం అనంతరం రాజీనామాలను ప్రకటించారు. కొత్త మంత్రివర్గం ఈరోజు చేరింది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 15 మంది మంత్రులు- 11 మంది కేబినెట్, 4 మంది రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

అశోక్ గెహ్లాట్ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు-గోవింద్ సింగ్ దోతస్రా, హరీష్ చౌదరి,రఘు శర్మలను మాత్రమే తొలగించారు. ఇతర మంత్రు లను కొనసాగించారు. ముగ్గురు రాష్ర్ట మంత్రులు షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) వర్గానికి చెందిన వారు. వీరికి కేబినేట్‌ ర్యాంకు ఇచ్చారు. వీరి తో పాటు మరో 12 మంది కొత్త మంత్రులుగా చేరుతున్నారు. సచిన్‌ పైలట్ క్యాంపు నుంచి ఐదుగురు క్యాబినేట్‌లోకి చేరనున్నారు. 12 మంది కొత్త మంత్రుల చేరికతో, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో మంత్రి మండలి సంఖ్య 30కి చేరుకుంటుంది.

Related Articles

Latest Articles