ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం

దివంగత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించే బాధ్యతను చేపట్టింది. ఇప్పటికే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లును ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలోని టెక్కలి, కుప్పం, పాలకొల్లు, రేపల్లె పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ ద్వారా కరోనా బాధితులకు అవసరమైన సేవలను అందిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-