‘ప్రిడేటర్ 5’ కోసం ప్రిపరేషన్స్ షురూ! ప్రాణలకు తెగించబోతోన్న సాహన నారి ఎవరు?

హాలీవుడ్ అంటేనే సీక్వెల్స్ మయం! ‘ప్రిడేటర్’ ఇందుకు మినహాయింపు కాదు. 2018లో వచ్చిన ‘ద ప్రిడేటర్’ వరుసలో నాలుగోది. ప్రస్తుతం 5వ ఇన్ స్టాల్మెంట్ కు కసరత్తులు జరుగుతున్నాయి. ‘ప్రిడేటర్ 5’లో కీ రోల్ ప్లే చేయనున్న యాక్టర్ పేరు కూడా బయటకు రావటంతో ఒక్కసారిగా అందరి దృష్టీ అటువైపు మళ్లింది. ముఖ్యంగా, ‘ప్రిడేటర్’ సిరీస్ ని క్లోజ్ గా ఫాలో అయ్యే యాక్షన్ లవ్వర్స్ కి!
‘ప్రిడేటర్ 5’లో ప్రధాన పాత్ర హీరోది కాదట! హీరోయినే ‘ప్రిడేటర్’ నుంచీ తన తెగ వార్ని రక్షిస్తుందట. ‘కీ’ అనే సాహస నారిగా యాంబర్ మిడ్ థండర్ నటించబోతోంది. ఆమె ‘లెజియన్’ మూవీ స్టార్ గా ఇప్పటికే ఫేమస్. ‘రోస్ వెల్, హెల్ ఆర్ హై వాటర్, లాంగ్ మైర్, బ్యాన్ షీ’ వంటి మరికొన్ని సినిమాలు, సిరీస్ లలోనూ మిడ్ థండర్ మెరుపులు మెరిపించింది. ‘ప్రిడేటర్ 5’లోనూ ఆమె యాక్షన్ సన్నివేశాలు జనాల్ని ఆకట్టుకుంటాయంటున్నారు. ఈ సినిమాపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ యూరోపియన్లు ఉత్తర అమెరికాలో కాలుమోపక ముందట కథ అని ప్రచారం జరుగుతోంది. సినిమాలో హీరోయిన్ తన తెగ వార్ని ‘ప్రిడేటర్’ నుంచీ ఎలా రక్షించుకుంటుంది అన్నదే కీలకమైన అంశం!

-Advertisement-‘ప్రిడేటర్ 5’ కోసం ప్రిపరేషన్స్ షురూ! ప్రాణలకు తెగించబోతోన్న సాహన నారి ఎవరు?

Related Articles

Latest Articles