అరెరే మాస్క్ ఎంత పని చేసింది.. భార్య అనుకోని మరొక ఆమెను..

కరోనా తరువాత మాస్క్ మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువు అయిపొయింది. ఈ మాస్క్ కొన్నిసార్లు మంచి చేసినా ఇంకొంతమందికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. తాజాగా మాస్క్ కారణంగా ఒక మహిళ చావు అంచుల వరకు వెళ్లివచ్చింది. ఈ ఘటన తిరువనంతపురంలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. కోజికోడ్ జిల్లా నన్మండాకు చెందిన బిజూ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్నిరోజులు సజావుగా సాగిన వారి కాపురంలో విభేదాలు తలెత్తాయి. దీంతో బార్యభర్తలిద్దరూ విడిపోయి ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే భార్య వదిలి వెళ్లిపోవడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు బీజూ.. ఎలాగైనా ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశాడు. ఎట్టకేలకు ఆమె బ్యాంకులో ఉందని తెలుసుకున్న బీజూ.. బ్యాంకు కి వెళ్లి మాస్క్ వేసుకొని చైర్ లో కూర్చున్న ఒక మహిళను కత్తితో పొడిచాడు. అయితే ఆమె ఎవరు నువ్వు..? ఎందుకు నన్ను చంపుతున్నావు అని అడగడంతో అనుమానం వచ్చి మాస్క్ తీసి ఖంగుతిన్నాడు. ఆమె తన మాజీ భార్య కాదని, బ్యాంకులో పనిచేసే ఉద్యోగిని అని తెలుసుకొని పరారయ్యాడు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతము ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Related Articles

Latest Articles