పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ గండి

ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతుంది. ప్రాజెక్టుకు గండి పడి నీరుగా వృధాగా పోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మత్తులు చేయాలని గతంలో పలుమార్లు అధికారులకు రైతులు విన్నవించినప్పటికీ పట్టించుకోని పరిస్థితి. నాసిరకంగా కెనాల్ నిర్మాణం చేపట్టండం వల్లే గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.

Read Also: మళ్లీ తెరపైకి మహిళా యూనివర్సీటీ..

ఓవైపు ప్రకృతి విపత్తులు మరో వైపు అధికారుల నిర్లక్ష్యంతో రైతుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాల్వకు గండిపడటంతో పక్కనున్న పొలాల్లోకి నీరు వెళ్తుండటంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటివి జరగడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కాల్వకు మరమ్మత్తులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాలెంవాగు ప్రాజెక్టు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో ఉంది.

Related Articles

Latest Articles