ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు : సిఎం కేజ్రీవాల్ ప్రకటన

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా రోగులకు ఆక్సిజన్, బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివే కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడగిస్తున్నట్లు సిఎం కేజ్రీవాల్ ప్రకటన చేశారు. మే 3 అంటే వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని సిఎం కేజ్రీవాల్ తెలిపారు.

-Advertisement-ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగింపు : సిఎం కేజ్రీవాల్ ప్రకటన

Related Articles

Latest Articles