భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్‌ తప్పుడు ప్రచారం మానుకోవాలి: జగన్‌

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేయడం ఏజెన్సీ ఏరియాల్లో కలకలం రేపుతుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంత ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ లేఖ విడుదల చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జగన్‌ విడుదల చేసిన లేఖ ఇప్పుడు ఇటు పోలీసులకు మింగుడు పడటం లేదు. తెలంగాణ మావోయిస్టు పార్టీని నిర్ములించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులు దాడులు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. డిసెంబర్ 26న జరిగిన పెసలపాడు ఎన్‌కౌంటర్ అబద్ధం అని జగన్‌ తెలపారు.

Read Also: రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా 317 జీవోను సవరించాలి: బీజేపీ

అమాయక ఆదివాసీలను కాల్చిచంపి ఎన్‌కౌంటర్ అని కట్టుకథ అల్లారన్నారు. మావో యిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సిరిసినగండ్ల సర్పంచ్ లక్ష్మారెడ్డికి మావోయిస్టులు లేఖ రాశారని సృష్టించారని, తప్పుడు లేఖ అడ్డుపెట్టుకుని పోలీసుల రక్షణ కోరాడాని జగన్‌ వెల్లడించారు. లక్ష్మారెడ్డి ద్వారా మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీలను కోవర్టులుగా వాడుకుంటే కోర్స రమేష్‌కు పట్టినగతే పడుతుందని జగన్‌ ఆ లేఖలో హెచ్చరించారు.

Related Articles

Latest Articles