ఆకట్టుకుంటున్న ఇంట్రో ఆఫ్ ‘కృష్ణలంక’

‘రంగు’ సినిమాతో ద‌ర్శకుడిగా త‌న‌దైన ముద్ర వేసిన కార్తికేయ ద‌ర్శక‌త్వంలో పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్ పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ తో సోహ్లా ప్రొడక్షన్స్,చేతన్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం కృష్ణలంక. మంగళవారం ఇంట్రో ఆఫ్ కృష్ణలంక వీడియో విడుద‌ల చేసింది యూనిట్. టీజ‌ర్, ట్రైల‌ర్ కు భిన్నంగా ప్రతి క్యారెక్టర్ తీరు తెన్నును ప‌రిచ‌యం చేసాడు ద‌ర్శకుడు. ఈ వీడియో ప్రేమ‌కు ప‌గ‌కు మ‌ద్య జ‌రిగే యుద్ధాన్ని ప‌రిచ‌యం చేసింది. ఇందులో ప‌రుచూరి వెంక‌టేశ్వరావు కుమారుడు ప‌రుచూరి ర‌వి పాత్ర ప్రత్యేక ఆక‌ర్షణ‌ అవుతుందంటున్నాడు దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడ‌క్షన్ వర్క్ జరుపు కుంటోంది. రియ‌లిస్టిక్ గా సాగే ఈ సినిమా హీరోయిన్ క్యాట‌లిన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరోలుగా న‌రేష్, ఆద‌ర్శ్ పెద్దిరాజు నటించారు. ప‌రుచూరి ర‌వి పాత్ర మాస్ అప్పీల్ తో ఉంటుంది. కృష్ణ సౌర‌భ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎమోష‌న్ ని బాగా ఎలివేట్ చేసాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా విడుద‌ల చేస్తామని, ఈ సినిమా తర్వాత తెలుగులో మ‌రిన్ని సినిమాలు తీస్తామంటున్నారు నిర్మాత.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-