ఇన్నోవా కారులో అనుమానస్పదంగా వ్యక్తి మృతి..

హన్మకొండ చౌరస్తాలో ఇన్నోవా కారులో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. చాలా రోజులుగా రిపేర్ కోసం పక్కకు పెట్టిన ఇన్నోవాలో వ్యక్తి చనిపోయిన ఘటన పైన పోలీసు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.. సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా అంచనా వేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మ గడ్డకు చెందిన రమేష్ అనే వ్యక్తి ఓ స్వీట్ షాపు లో పని చేసేవాడు.. తాగుడుకు బానిసగా మారి సరిగా పని చేయకపోవడంతో రమేష్‌ను గత నెలలో పని నుండి తీసేశారు. అయితే రమేష్ పని చేసే స్వీట్ షాపు ఓనర్ ఇన్నోవాలోనే చనిపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు 5 తేదీన తన షాపుకు వచ్చిన రమేష్ 1000 అప్పు కావాలి అంటే ఇచ్చానని స్వీట్‌ షాపు యజమాని చెబుతున్నారు. తనకు అంతకు మించి ఏం తెలియదని ఆయన అంటున్నారు. సాధారణంగా ఇన్నోవా కీస్ ఎప్పుడు షాపులోనే ఉండే విషయం తెలిసిన రమేష ఎప్పుడు ఇన్నోవా కీ తీసుకున్నాడో గమనించలేదని స్వీట్‌ షాపు యజమాని పోలీసులకు తెలిపారు.దీంతో పోలీసులు హన్మకొండ చౌరస్తాలో ఉన్న మూడు షాపుల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.. వారి పరిశీలనలో 5 తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో రమేష్ ఒక్కడే ఇన్నోవా వాహనంలోకి ఎక్కినట్టు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిర్ధారించారు.

Read Also: రైతులు సాగు చేసుకున్న చెట్లను అమ్ముకునేందుకు లంచాలా..?: అయ్యన్న పాత్రుడు

ఇన్నోవా లోకి వెళ్లిన రమేష్ మళ్ళీ బయటకు రాలేదు రిపేర్‌కు వచ్చిన ఇన్నోవాను చాలా రోజులుగా పక్కకు పెట్టడంతో అటువైపుగా ఎవ్వరూ వెళ్లలేదు. ఈరోజు ఇన్నోవా నుంచి దుర్వాసన రావడంతో పరిశీలిస్తే ఇన్నోవాలోవ్యక్తి చనిపోయిన విషయం బయటపడింది. కుటుంభ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసు పోస్టుమార్టం కోసం డెడ్‌ బాడీని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టుతో పూర్తి వివరాలు తెలసుస్తాయని పోలీసులు వెల్లడించారు.

Related Articles

Latest Articles