తెలంగాణలో 27వరకు వర్షాలు

దక్షిణ బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ప్రభావం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల27 వరకు తేలిక పాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు బలంగా వీస్తున్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆకాశం పాక్షి కంగా మేఘావృతం అయి ఉంటుందని, ఈశాన్య దిశ ఉపరితల గాలు లు గంటకు ఆరు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో గాలులు, మెరుపులు మొదల య్యాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Related Articles

Latest Articles