సారు నెల రోజులైంది దళితబంధు ఏదీ..?


హుజురాబాద్‌ ఉప ఎన్నిక మినీ రాజకీయ యుద్ధాన్ని తలపించింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌ చేయని ప్రయత్నం లేదు. ఒకరి మీద కరు విమర్శలు ప్రతి విమర్శలతో మాటల దాడికి దిగారు ఆయా పార్టీల నేతలు. అధికార పార్టీ దొంగల పార్టీ అని బీజేపీ వాళ్లు అంటే .. టీఆర్‌ఎస్‌ పార్టీనే దొంగల పార్టీ అని బీజేపీ నాయకులు ఒకరి పై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార టీఆర్‌ఎస్‌ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రస్తావనను తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు లాంఛనమే అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది టీఆర్‌ఎస్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలిచారు.

ఇదిలా ఉంటే హుజురాబాద్‌లో ఎన్నికల ఫలితాలు రాగానే దళిత బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆయన ఆమాట ఇచ్చి నెలరోజులు పూర్తవుతుంది. నవంబర్‌ 2న ఫలితాలు వస్తాయని, నాలుగో తేది నుంచి స్వయంగా పంపిణీ చేస్తానని మీడియాతో తెలిపారు. కానీ ఆదిశగా ఇప్పటి వరకు ప్రయత్నాలు శూన్యమనే చెప్పాలి. నవంబర్‌ 4 పోయి, డిసెంబర్‌ 4 వచ్చింది. సారు మాత్రం ఇంకా ఆ ముచ్చట తీయడం లేదని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఇంకా చాలా కుటుంబాలకు దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు అందాల్సి ఉంది. ఎన్నికలప్పుడేనా పథకాలు తర్వాత గుర్తు రావా అంటూ నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్‌, ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles