మరియమ్మ లాక్ అప్ డెత్ కేస్ పై తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు

తెలంగాణలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్‌ అప్‌ డెత్‌ కేసుపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. దీనిపై ఇప్పుడే తీర్పు చెప్పలేమని కోర్టు తెలిపింది. యాదాద్రి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఈ ఘటన తో రాష్ర్టం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీంతో వివిధ సంఘా ల ఆధ్వర్యంలో ప్రభుత్వవైఖరిని ప్రశ్నించారు. దీంతో ప్రభు త్వం బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని హామీ ఇచ్చింది. కాగా ఈ కేసులను సీబీఐకి అప్పగించే విషయంపై తీర్పును రిజర్వు చేసింది. విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక విషయాలు కోర్టు వెల్లడించింది.

పోలీసుల తరపున హైకోర్టుకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ హాజరయ్యారు. హైకోర్టుకు సీబీఐ ఎస్పీ కళ్యాణ్, ఐబీ అధికారి సంబంద్‌ హాజరయ్యారు. ఈ కేసులో బాధ్యులైన ఇద్దరూ పోలీస్‌ అధికా రులను వీధుల్లో నుంచి తొలగించినట్టు ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే తెలంగాణ పోలీసులపైన ప్రజలకు విశ్వా సం సన్నగిల్లే అవకాశం ఉందన్న ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసును సీబీఐకి అప్పగించే అంశం పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తదుపరి విచారణలో కోర్టు తీర్పును వెల్లడించింది. బాధ్యులైన వారిపై ఎలాటి చర్యలు తీసుకున్నారని కోర్టు ఏజీని ప్రశ్నించింది.

Related Articles

Latest Articles