అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇప్ప‌టికే 78 మందిని గుర్తించిన స‌ర్కార్

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌ల్లిదండ్రులను కోల్పో్యి అనాథ‌లుగా మారిన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. వారి పేర్ల‌తో రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.. ఇక‌, అందులో భాగంగా.. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్ల‌పై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఈ సంద‌ర్భంగా.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బును సరైన స్కీంలో డిపాజిట్‌ అయ్యేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.. వివిధ సంస్థల పాలసీలను పరిశీలించి అందులో ఆ డబ్బును డిపాజిట్‌ చేయాలని నిర్దేశించారు.. మ‌రోవైపు.. ఇంకా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి.. తాజా బులెటిన్ ప్ర‌కారం.. ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 14,429 కొత్త కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 103 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-