ఉద్యోగం ఇప్పిస్తానని వ్యభిచారంలోకి.. 11 ఏళ్లుగా చిత్రహింసలు పెడుతూ

అభం శుభం తెలియని అమాయక ఆడపిల్ల.. తల్లి మృతి చెందడంతో అనాధగా మారింది. 15 ఏళ్ల లేత ప్రాయం.. ఏం చేయాలో తెలియదు.. ఎటు పోవాలో అర్థంకాదు. ఆలాంటి దీన స్థితిలో ఉన్న ఆడపిల్లలకు ఉద్యోగం ఆశచూపి బోర్డర్ దాటించాడు ఒక దుర్మార్గుడు. అతడి మాయమాటలు నమ్మి ఆ బాలిక బాంగ్లాదేశ్ నుంచి భారత్ లో అడుగుపెట్టింది. ఇక్కడికి వచ్చాక ఆ నీచుడు నిజ స్వరూపం బయటపడింది. పేదరికంలో ముగ్గుతున్న ఆడపిల్లకు డబ్బు ఆశచూపి వ్యభిచారంలోకి దింపి, అమ్మాయిలను అమ్ముకొనే బ్రోకర్ అతనిని తెలుసుకొంది. ఆ తరువాత చిత్రహింసలకు గురై వ్యభిచారంలోకి దిగి పోలీస్ రైడ్ లో పట్టుబడిన ఓ యువతి కన్నీటి వ్యధ విని పోలీసులు సైతం నివ్వెరపోయారు.

ముంబైలోని ఒక స్టార్ హోటల్లో వ్యభిచార దందా జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు రైడ్ నిర్వహించారు. అక్కడ వారికి కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి విచారించారు. అందులో ఒక బంగ్లాదేశ్ యువతి తన కన్నీటి వ్యధను పోలీసులకు చెప్పుకొంది.” నా తల్లి నా 15 వ ఏట మృతిచెందింది. అప్పుడు ఏం చేయాలో తెలియదు.. అప్పుడే ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి భారత్ కి తీసుకొచ్చాడు. ఆ తరువాత నన్ను కొట్టి వ్యభిచారంలోకి దిగమన్నాడు. నేను ఒప్పుకోకపోతే రోజు నన్ను సిగరెట్లతో కాల్చేవాడు.. దీంతో ఆ బాధను తట్టుకోలేక వ్యభిచారంలోకి దిగాను. కొద్దిరోజులకు అతను నన్ను ముంబైలో మరొక వ్యక్తికి లక్ష రూపాయలకు అమ్మేశాడు. ఇక్కడ వారు ఏది చెప్తే అది చేయాలి.. లేకపోతే చిత్ర హింసలు పెడతారు.. పస్తులతో పడుకోబెడతారు. 11 ఏళ్లుగా ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను. నేనే కాదు ఈ రొంపిలో ఎంతోమంది పేద యువతులు బలి అవుతున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కథ విని పోలీసులు సైతం కంటతడి పెట్టుకున్నారు. కొంతమంది డబ్బు కోసం చేసే నీచమైన పనికి ఇలాంటి అమాయక ఆడపిల్లలు బలవుతున్నారు.

Related Articles

Latest Articles