దూసుకెళ్తున్న “గానా ఆఫ్ రిపబ్లిక్”

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్… తదితర అంశాలతో ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమవుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ పేరుతో ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Read Also : చెర్రీ – శంకర్ మూవీకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్

ఈ పాటను రెహమాన్ రాశారు. మణిశర్మ స్వరపరిచారు. ఈ కాలేజ్ బ్యాక్ డ్రాప్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, ధనుంజయ్, హైమత్ మహ్మద్, ఆదిత్య అయ్యంగార్, పృధ్వీచంద్ర పాడారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూర్చారు. ఈ సాంగ్ ఇప్పుడు సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తోంది. ఈ సాంగ్ కు విడుదలైన తక్కువ సమయంలోనే 2.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. కాగా ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్న “రిపబ్లిక్” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-