‘మంచి రోజులు వచ్చాయి’ అంటున్న మారుతి

ఓ పక్క గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ మూవీ చేస్తూనే దర్శకుడు మారుతి మరో క్యూట్ స్మాల్ లవ్ స్టోరీని కూడా తెరకెక్కించేశాడు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతూనే ఉన్నా, మారుతీ మాత్రం ఎప్పుడూ అధికారికంగా తన కొత్త సినిమా గురించి పెదవి విప్పలేదు. అయితే… మంగళవారం ఉదయం మాత్రం చిన్న హింట్ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ఇటీవలే ‘ఏక్ మినీ కథ’లో నటించిన సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా మారుతి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. యూవీ కాన్సెప్ట్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో విసెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాను అతి త్వరలోనే ‘హెల్దీ థియేటర్స్’లో విడుదల చేస్తామని మారుతి చెప్పడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-