కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చివరి షెడ్యూల్ ప్రారంభం

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడ నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ చేస్తున్నారు.

‘రంగమార్తాడ’ సినిమా గురించి కృష్ణవంశీ చెబుతూ.. ‘నా అభిమాన నటుడు, నట రాక్షసుడు ప్రకాశ్‌ రాజ్ తో ఎమోషనల్ క్లయిమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నాను’ అని పేర్కొన్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, లక్ష్మీ భూపాల్ తదితరులు ఇందులోని పాటలను రాస్తున్నారు. మాటల్లాంటి ఓ పాటను మెగాస్టార్ చిరంజీవి పాడటం విశేషం.

Related Articles

Latest Articles