కారు ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడి కుటుంబం

గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్‌ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. అయితే ప్రమాదానికి గురైన కారులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చినాన్న కుమారుడు మదన్‌ మోహన్‌రెడ్డితో పాటు ఆయన భార్య, కుమార్తెలు ఉన్నారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో మోహన్‌రెడ్డి భార్త, కుమార్తెలు ఘటన స్థలంలోనే మరణించారు.

కారు కాలువలోకి దూసకెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని నీటిలో మునిగిన కారును తీసేలోపే మోహన్‌రెడ్డి భార్య, కుమార్తెలు మృతిచెందారు. మోహన్‌రెడ్డికి కూడా తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Latest Articles