సైబర్‌ ల్యాబ్‌తో మహిళలకు రక్షణ

తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీంలు పనిచేస్తున్నాయి. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపులను నియంత్రించడానికి సైబర్‌ ల్యాబ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా సెల్‌ఫోన్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌తో వేధించే వారిని ఈ సైబర్‌ల్యాబ్ పసిగడుతుంది.

రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లకు ఈ ల్యాబ్‌ సాంకేతిక సహాయాన్ని అందజేయనుంది. దీంతో పాటు మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా చేసే వ్యవస్థలపై నిఘా పెట్టనుంది. ఇప్పటికే సీసీ కెమెరాలతో సాయంతో ఎన్నో నేరాలను అదుపు చేస్తున్నారు. సైబర్‌ ల్యాబ్‌ ఏర్పాటుతో పోలీసులకు కేసులను చేధించడం సులువుగా మారనుంది.

Related Articles

Latest Articles