బ్రెజిల్‌లో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నా కరోనా..

బ్రెజిల్‌లో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుంది. గడచిన 24 గంటల్లో 12,930 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల 22,043,112 సంఖ్యకి చేరింది. ఇక మంగళవారం ఒక్కరోజే 273 మంది కరోనాతో మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య 613,339కి చేరింది. ఇక బ్రెజిల్‌లో గత ఏడురోజుల్లో సగటున 9,350మంది కరోనా బారినపడ్డారని, 213 మంది మరణించారని అక్కడి ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. లక్షలాది మంది నివసించే ప్రాంతాల్లో 10,489 మంది ఇన్ఫెక్షన్స్‌కు గురవ్వగా … 291.9 మంది మరణిస్తున్నారని కరోనా లెక్కలు చెబుతున్నాయి.

కాగా, బ్రెజిల్‌లో అత్యధిక జనాభా కలిగి ఉన్న ఆగేయ రాష్ట్రమైన సావో పాలోలో 4,433,915 కరోనా కేసులు నమోదయ్యాయని, 153,639 మంది కరోనాకు బలయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న రియో డి జనీరో రాష్ట్రంలో 1,339,819 కేసులు నమోదు అవ్వగా 68,919 మంది మృతి చెందారు. మరోవైపు ఆ దేశంలో 13 కోట్ల 4 లక్షల మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. మంగళవారం నాటికి 15 కోట్ల 82 లక్షల మంది మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికి ప్రపంచంలో కోవిడ్‌ మరణాల్లో అమెరికా మొదటిస్థానంలో ఉండగా.. రెండోస్థానంలో బ్రెజిల్‌ నిలిచింది. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కేసులు కలిగిన ఉన్న మూడో స్థానంలో భారత్‌ నిలిచిందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Related Articles

Latest Articles