85 మంది విద్యార్థులకు కరోనా

కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకోని మాములు స్థితిలోకి వచ్చినా ..మళ్లీ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్‌ విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతునే ఉంది. అయినా ఏదో రూపంలో ఈ మహమ్మారి విరుచుకుపడుతునే ఉంది. పెద్ద చిన్న అన్న తేడా లేకుండా తన పంజా విసురుతుంది. మరోవైపు ఐసీఎంఆర్‌, కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ప్రజలను హెచ్చరిస్తునే ఉన్నాయి. తాజాగా..ఉత్తరఖండ్‌-నైనిటాల్‌ నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోరానాపాజిటివ్‌ నిర్ధారణ అయింది. తొలుత 11మందికి పాజిటివ్‌ రాగా పాఠశాలలోని మొత్తం 496 మందికి టెస్టులు నిర్వహించారు.

Read Also: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేజ్రీవాల్‌

దీంతో 85మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విద్యార్థులకు కరోనా టెస్టులతో పాటు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు కూడానిర్వహించారు. ఆర్టీపీసీఆర్‌లోనూ పాజిటివ్‌ వచ్చింది. కలెక్టర్‌ ఆదేశాలతో స్కూల్‌ను కంటైనైమెంట్‌ జోన్‌గా ప్రకటించారు. కోవిడ్‌ సోకిన విద్యార్థులను పాఠశాలలోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయి ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించడంతో పాటు పాఠశాలకు సెలవులను ప్రకటించింది. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎప్పటికప్పడు కోవిడ్‌ నివారణ చర్యలను ప్రభుత్వం తీసుకుటుందని అక్కడి అధికారులు వెల్లడించారు.

Related Articles

Latest Articles