రైతుల మీద రాజకీయాలు ఏంటి కేసీఆర్‌..?: రాజాసింగ్‌

రైతులు ఇబ్బందులు పడుతుంటే రాజకీయాల వారిపైనే కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 500,1000 రూపాయలు ఇచ్చి కిరాయి గుండాలతో TRS నేతలు బండి సంజయ్ వెహికిల్ పై రాళ్ళ దాడి చేశారని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలు దీటుగా ఎదుర్కొని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, గుండాలకు సరైన సమాధానం చెప్పారన్నారు. రైతులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, రైతులను మోసం చేస్తున్నాడు.

హుజూరాబాద్ ఎలక్షన్ లో TRS ఓటమిని తట్టుకోలేక ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తుందన్నారు. భవిష్యత్‌లో ఇంకా చాలా ఎన్నికలు ఎదుర్కోవాలి ..అప్పుడు ఎలా తట్టుకుంటారని రాజాసింగ్‌ ప్రశ్నిం చారు. ధాన్యం కొనడం చేతకాక కేంద్రం పై ఆరోపణలు చేస్తు న్నారని కేసీఆర్‌కు ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. ఇప్పటికైనా ప్రతి పక్షాలపై విమర్శలు మాని పాలన పై దృష్టిపెట్టాలని రాజాసింగ్‌ అన్నారు.

Related Articles

Latest Articles