గడ్చిరోలి ఎన్ కౌంటర్ : మరో కీలక నేత మృతదేహం లభ్యం

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారబట్టిలో గత శనివారం భీకర ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసింది. ఈ ఎన్‌ కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందగా, అందులో ఆరుగు మహిళలు ఉన్నారు. అయితే మరణించిన వారిలో కీలక నేతలు ఉండటం గమనార్హం. తాజాగా గడ్చిరోలి జిల్లా కుడుగుల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ పార్టీలకు మరో మావో మృత దేహం లభ్యమైంది. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆ మృతదేహం జహల్ నక్సలైట్ నాయకుడు సుఖ్‌లాల్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సుఖ్‌లాల్‌ మరణించినట్టు గడ్చి రోలి పోలీసులు మరణించారు. దండకారణ్య జోనల్ కమిటీ సభ్యుడు సుఖ్‌లాల్‌పై రూ.25 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఘటనా స్థలం నుంచి ఒక గ్రామ సాయుధుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related Articles

Latest Articles