బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి : సీఎం కేసీఆర్‌

రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని ఆయన అన్నారు. దేశంలో రైతులను బీజేపీ బతకనిచ్చేలా లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎరువుల ధరలు పెంచుతూ.. రైతుల ఆదాయం పెంచుతామన్న కేంద్రం ఖర్చులు రెట్టింపు చేసిందని కేసీఆర్‌ విమర్శించారు. ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

కరెంట్‌ మోటర్లతో బిల్లులు వసూలు చేయడం, ధాన్యం కొనకుండా ఎరువుల ధరలు పెంచడం కుట్ర అని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పెంచిన ఎరువుల ధరలు తగ్గించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసి కేంద్రం మెడలు వంచుతామన్నారు. బీజేపీనీ కూకటి వేళ్లతో పెకళించి వేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles