రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా 317 జీవోను సవరించాలి: బీజేపీ

రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా 317 జీవోను సవరించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుంది. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలోని బాబాపూర్‌కు చెందిన సరస్వతి 317 జీవో మూలంగా స్వంత ఊరు నుంచి కామారెడ్డికి ట్రాన్సఫర్‌ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ పిలుపు మేరకు పార్టీ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు ఎం ధర్మారావు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విట్టల్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనర్సయ్యలు కలిసి సరస్వతి కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు బాబాపూర్‌ గ్రామానికి వెళ్లనున్నట్టు బీజేపీ వర్గాలు ప్రకటించాయి.

Read Also: కోవిడ్‌ విజృంభిస్తున్న వేళ.. మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 317 జీవోతో కామారెడ్డికి ట్రాన్సఫర్‌ అయిన ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన సరస్వతి ఆత్మహత్యకు తమను కలిచి వేసిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న టీచర్లు ఈ జీవోతో ఇబ్బందులు పడడం జీవితాలు చాలించడం ఎంతో బాధాకరమని తెలిపారు. మనస్తాపానికి గురై ఇప్పటికీ తొమ్మిది మంది బలవన్మరణాలకు పాల్పడడం దురదృష్టకరం. ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడకూడదని బీజేపీ శ్రేణులు విజ్ఞప్తి చేశాయి. ఆత్మహత్యలకు పాల్పడ్డ , గుండె ఆగి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

Related Articles

Latest Articles