ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం కొనదు: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

వరి ధాన్యం విషయంలో ధర్నా చేస్తున్న కేసీఆర్‌పై వైఖరిని తప్పు బడుతూ.. కేంద్రప్రభుత్వ వర్గాలు స్పందించాయి.గత ఖరీఫ్‌లో 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం కొన్నది. ఈ ఏడాది 25 శాతానికి పెంచి, 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయించాం. ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (60 లక్షల ధాన్యం) కొనుగోలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తాం. రబీలో ఎంత ధాన్యం కొనుగోలు చేసేది త్వరలోనే స్పష్టం చేస్తాం. ఉప్పుడు బియ్యం తినే రాష్ట్రాలు సొంతంగా సేకరణ చేసుకుంటున్నాయి.

జాతీయ ప్రయోజనాల రీత్యా పంట వైవిధ్యం అవసరమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దేశంలో వరి పంట సాగు ఎక్కువైంది. దేశం లో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయి. దేశంలో పప్పుధాన్యాల కొరత పెరిగిపోతుండడంతో, దిగుమతులు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్ప డింది. పంట వైవిధ్యం, పంట మార్పిడి ఆవశ్యకతపై గతంలో కేంద్రం నిర్వహించిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. అన్ని రాష్ట్రాలలో వరి పంట సాగు పెరగడంతో, ధాన్యం దిగుబడులు కూడా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Related Articles

Latest Articles