జీవో నెం.59ని వెనక్కు తీసుకుంటున్నాం: ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లోని జీవోనెం.29కు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. వార్డు, మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమిస్తు రాష్ర్ట ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే జీవో నెం.59ను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. డ్రెస్‌ కోడ్‌ను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో విచారణణు మరో వారానికి వాయిదా వేసింది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం పలు మార్లు చర్చించిందని ప్రభుత్వ తరపు లాయర్‌ తెలిపారు.

Related Articles

Latest Articles