మెగా రిటైల్‌ టెక్సటైల్‌ పార్క్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి : తాడేపల్లిలో మెగా రిటైల్‌ టెక్సటైల్‌ పార్క్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 7 లక్షల చదరపు అడుగుల్లో మెగా రిటైల్‌ టెక్సటైల్‌ పార్క్‌ ఏర్పాటుకు సర్కార్‌ ఆమోదం తెలిపింది. మెగా రిటైల్‌ టెక్సటైల్‌ పార్క్‌ నిర్మించడానికి ముందుకు వచ్చిన కేపిటల్‌ బిజినెస్‌ పార్క్‌ సంస్థ… రూ. 194.16 కోట్ల పెట్టుబడితో మెగా రిటైల్‌ టెక్సటైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనుంది.

read also : అభివృద్ధికి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకం: గవర్నర్ తమిళిసై

900 రిటైల్‌ టెక్సటైల్‌ ఔట్‌లెట్లు ఉండేలా పార్క్‌ నిర్మాణం ఉండనుండగా… మెగా రిటైల్‌ పార్క్‌ ద్వారా 5 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. రిటైల్‌ పార్క్స్‌ పాలసీలో తొలి ప్రాజెక్టుగా కేపిటల్‌ బిజినెస్‌ పార్క్‌ సంస్థకు రాయితీలను ప్రకటించింది ప్రభుత్వం. పార్క్‌ వెలుపల ఏర్పాటు కల్పించే మౌళిక సదుపాయాల ఖర్చులో రూ. 3 కోట్లకు మించకుండా 50 శాతం తిరిగి ఇవ్వనుంది ప్రభుత్వం. 100 శాతం స్టాంప్‌ డ్యూటీ నుంచి మినహాయింపులు కూడా ఇచ్చింది సర్కార్‌.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-