సంక్రాంతికి ఆహాలో ‘ది అమెరికన్ డ్రీమ్’

యంగ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ ఈ మధ్య మరీ నల్లపూసగా అయిపోయాడు. అయితే అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై ప్రిన్స్ దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ చేసిన ప్రిన్స్ తాజాగా ఓ ఓటీటీ చిత్రంలోనూ నటించాడు. అదే ‘ది అమెరికన్ డ్రీమ్’. జీవితంలో ఏదో సాధించాలని అమెరికా వెళ్ళిన రాహుల్ చివరకు వాష్ రూమ్స్ క్లీన్ చేయాల్సిన పరిస్థితిలో పడతాడు. ఓ రోజు పబ్ లో పరిచయం అయిన రియా అనే అమ్మాయి కారణంగా అతని జీవితం మారిపోతుంది. కానీ ఊహించని విధంగా రియా కారుతో ఓ రాత్రి మహిళను గుద్దేసి ఆమె మరణానికి కారకుడవుతాడు.

విలాసవంతమైన జీవితం గడపడానికి అమెరికా వెళ్ళిన రాహుల్ ఈ కష్టాల నుండి ఎలా బయట పడ్డాడన్నదే ఈ చిత్ర కథ. సంక్రాంతి కానుకగా ‘ది అమెరికన్ డ్రీమ్’ మూవీ 14వ తేదీ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు. నేహా కృష్ణ, రవితేజా ముక్కావలి, శుభలేఖ సుధాకర్, శ్రీ మిరాజ్కర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అభినయ్ తిమ్మరాజు సంగీతం అందించాడు. డా. విఘ్నేష్ కౌశిక్ దర్శకత్వంలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

Related Articles

Latest Articles