‘అఖండ’లో ఆ సున్నితమైన అంశం.. పొలిటికల్ సెటైర్ ?

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. సినిమాను ప్రకటించినప్పటి నుంచే సినిమా గురించి భారీ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు భారీ విజయాన్ని సాధించడం దీనికి కారణం. హ్యాట్రిక్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తుండడం మరో కారణం. ఆయన గత చిత్రాల మ్యూజిక్ దేశవ్యాప్తంగా మారు మ్రోగడంతో ఈ సినిమాకు కూడా మంచి సంగీతం అందిస్తాడని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో బాలయ్య ఉగ్రరూపం, అఘోరాగా ఆయన అవతారం, హీరో నుంచి విలన్ గా టర్న్ అవుతున్న శ్రీకాంత్ నటన, డైలాగ్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేశాయి.

పొలిటికల్ సెటైర్లా..?
“మేము ఏంటో అంచనా లేకుండా హామీలిస్తున్నావ్… అంటే ‘ఏయ్ అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా ? పట్టిసీమ తూమా? పిల్ల కాలువ”, “సింహం జూలు విదిలిస్తే… ఒక మాట నువ్ అంటే శబ్దం, అదే మాట నేనంటే శాసనం… దైవ శాసనం… ఒకసారి డిసైడ్ అయ్యి బరిలోకి దూకితే బ్రేకులు లేని బుల్డోజర్ ని… తొక్కి పారదొబ్బుతా… లెఫ్ట్, రైటా, టాపా, బాటమా.. ఎటు నుంచి వెతికినా కొడకా ఇంచు బాడీ కూడా దొరకదు… మీకు సమస్య వస్తే దండం పెడతారు… నాకు సమస్య వస్తే పిండం పెడతాం…బోత్ ఆర్ నాట్ సేమ్” అంటూ బాలయ్య ఉగ్రరూపం చూపించిన ట్రైలర్ ను పొలిటికల్ సెటైర్లుగా వాడుకుంటున్నారు నందమూరి అభిమానులు. ఇటీవల అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరిని అవమానించారంటూ మీడియా ముందు ఏడవడం, దీనికి టీడీపీ నాయకులతో పాటు నందమూరి ఫ్యామిలీ కూడా రియాక్ట్ అవ్వడం తెలిసిందే. ఇంకోసారి ఇలా జరిగితే సహించేది లేదంటూ ఈ విషయంపై బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అదే సందర్భంలో ‘అఖండ’ ట్రయిల్ లోని డైలాగులను వాడుతూ వైసీపీ నాయకులపై పలు మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇలా కూడా ‘అఖండ’ ప్రమోషన్స్ జరిగాయన్న మాట.

‘అఖండ’ స్టోరీ ఇదే!
‘అఖండ’ సినిమాతో బోయపాటి సున్నితమైన అంశాన్ని టచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాలయాలు, విగ్రహాలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది అనే టాక్ నడుస్తోంది. ట్రైలర్ లో కూడా ఇదే అంశం రివీల్ అవుతోంది. మొత్తం టెంపుల్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన హైలైట్ కానుంది. ఈ సినిమాలో మహిళలపై హింస అనేది కీలకమైన భావోద్వేగాలలో ఒకటి. యాక్షన్ మసాలాతో అద్భుతమైన ఎమోషన్స్ ను కలగలిపి బోయపాటి తన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

నందమూరి సినిమాలో మెగా జోక్యం
సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. నవంబర్ 27 న శిల్ప‌ క‌ళా వేదిక‌లో ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. వైభవంగా జరగబోయే ఈ వేడుకలో బాలకృష్ణతో కలిసి అల్లు అర్జున్ సందడి చేయనున్నారు.

Related Articles

Latest Articles